లాప్రోస్కోపిక్ ఆపరేషన్ ద్వారా 25 ఎంఎం స్టోన్ ఒకటి, 100 కు పైగా స్టోన్స్ తొలగింపు
*డాక్టర్ శంకర్, తేజస్వి,అఖిల ఆధ్వర్యంలో విజయవంతంగా ఆపరేషన్
*క్లిష్టమైన ఆపరేషన్ చేసిన డాక్టర్ల బృందానికి కృతజ్ఞతలు పేషంట్ బంధువులు
ముస్తాబాద్: సెప్టెంబర్ 12
మండలంలోని పీపుల్స్ హాస్పిటల్ లో అరుదైన ఆపరేషన్ విజయవంతంగా జరిగినట్లు పీపుల్స్ ఆసుపత్రి వర్గాలు పత్రిక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించిన డాక్టర్లు చింతోజు శంకర్, కె.బి తేజస్వి , చింతోజు అఖిల మాట్లాడుతూ సిద్దిపేట జిల్లా దుబ్బాక గ్రామానికి చెందిన కదిరే విజయ అనే మహిళ కడుపు నొప్పితో బాధపడుతూ తమను సంప్రదించిందని, ఆమెను పరీక్షించి అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా గాల్ బ్లాడర్ లో పెద్ద మొత్తంలో (స్టోన్స్) రాళ్లు ఉన్నాయని గుర్తించామని, చాలా అరుదుగా ఇలాంటి కేసులు నమోదు అవుతుంటాయన్నారు. లాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారా 25 ఎంఎం స్టోన్ 1, వందకు పైగా స్టోన్స్ రెండు గంటలకు పైగా శ్రమించి విజయవంతంగా తొలగించామని ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించారు. క్లిష్టమైన ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించి ప్రాణాలు కాపాడిన డాక్టర్ల బృందానికి మహిళ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. అనస్తీసియా డాక్టర్ ప్రతాప్,థియేటర్ సిబ్బంది లింగం, రాజు, విజయ్, అజయ్ ,సంజీవ్ ,లత పాల్గొన్నారు.
