సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం సెప్టెంబర్ 12 (24/7 తెలుగు న్యూస్):జగదేవపూర్ మండల కేంద్రంకు చెందిన రెడ్డి సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావును రెడ్డి సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి రెడ్డి సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని కోరగా వెంటనే స్పందించి 50 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు, స్థానిక ఎంపీటీసీ కొత్త కవిత శ్రీనివాస్ రెడ్డి, మండల రైతు సమన్వయ సమితి సభ్యులు మారుతి వెంకట నరసింహారెడ్డి, సూరమ్మ గారి వెంకటరెడ్డి, ఇట్టిరెడ్డి వెంకట నరసింహారెడ్డి, హరిప్రసన్న రెడ్డి, మధుసూదన్ రెడ్డి,సంతోష్ రెడ్డి,కొత్త శ్రీనివాస్ రెడ్డి , నవీన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి,అభిలాష్ రెడ్డి ,నాయకులు తదితరులు పాల్గొన్నారు.
