చంద్రబాబు అరెస్ట్‌తో బరిలోకి బాలయ్య.. ముఖ్య నేతలతో కీలక సమావేశం, దేనికైనా రెడీ అన్న బాలయ్య బాబు
సెప్టెంబర్ 12
అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో సీనియర్ నేతలు సమావేశం అయ్యారు బాలకృష్ణతో పాటు యనమల రామకృష్ణుడు కంభంపాటి రామ్మోహన్ ఆలపాటి రాజా అనురాధ గొట్టిపాటి రవికుమార్ ఏలూరు సాంబశివరావు అనగాని సత్యప్రసాద్, పట్టాభి రామ్ సహా ఇతర సీనియర్ నాయకులు భేటీ అయ్యారు.
చంద్రబాబు జైల్లో ఉండటంతో భవిష్యత్తు కార్యాచరణపై నేతలు సమాలోచనలు చేశారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ముఖ్య నేతలతో సమాలోచనలు జరిపారు బాలయ్య నెక్ట్స్ ఏం చేయాలి? ఎలా ముందుకెళ్లాలి.? అనేదానిపై ఈ సమావేశంలో డిస్కస్ చేశారు.
