*రామగుండం పోలీస్ కమిషనరేట్
*మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుడుంబా పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు*
రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జిల్లా రామకృష్ణపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల పొన్నారం గ్రామంలో గల బర్ల సత్తమ్మ అనే మహిళ ప్రభుత్వ నిషేదిత గుడుంబా అమ్ముతున్నదనే నమ్మదగిన సమాచారం మేరకు ఆమె ఇంటి పరిసర ప్రాంతం లో మంచిర్యాల టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్, ఎస్ఐ మరియు సిబ్బందితో కలిసి తనిఖీ నిర్వహించగా వారి ఇంటి పేరడులో 60 గుడుంబా పాకెట్లు లభించాయి.
*నిందితురాలి వివరాలు*
*బర్ల సత్తమ్మ w/o కృష్ణమూర్తి , వయస్సు :47సం”, కులం : మున్నురు కాపు , వృత్తి : గృహిణి , నివాసం :పొన్నారం విల్లెజి of మందమర్రి మండల్ of రామకృష్ణాపూర్.*
గుడుంబా అమ్ముతున్న వ్యక్తిని మరియు దొరికిన గుడుంబా పాకెట్లను తదుపరి విచారణ నిమిత్తం రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ లో అప్పగించడం జరిగింది.
