యూత్ కాంగ్రెస్ యూత్ గౌరవ అధ్యక్షులు జంగం భాను చందర్
ములుగు జిల్లా,మంగపేట, సెప్టెంబర్ 11
కేయూ విద్యార్థులపై జరిగిన దాడిని ఖండిస్తూ రేపు కేయూ పరిధిలో ఉన్న విద్యా సంస్థలు అన్ని బందు పాటించాలని కేయూ యూనివర్సిటీ విసి రమేష్ ని వెంటేనే బర్తరఫ్ చేయాలని యూత్ కాంగ్రెస్ యూత్ గౌరవ అధ్యక్షులు జంగం భాను చందర్ పేర్కొన్నారు.మంగపేట మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో యూత్ గౌరవ అధ్యక్షులు జంగం భాను చందర్ మాట్లాడుతూ కేయూ పీహెచ్డీ జరిగిన అవకతవక లన్నీ గవర్నర్ చొరవ చూపి తగిన చర్యలు వెంటనే చేపట్టా లని విద్యార్థులపై దాడి చేసిన పోలీసులపై వెంటనే తగు చర్యలు చేపట్టాలని లేనిప క్షంలో కేయూ జేఏసీ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తా మని తెలంగాణ కోసం ఉద్యమ పోరాటంలో ముందుండి కొట్లా డిన కేయూ విశ్వవిద్యా లయా న్ని ప్రయత్నంలో టిఆర్ఎస్ ప్రభుత్వం పల్ల రాజేశ్వర్ రెడ్డికి యూనివర్సిటీల బాధ్యతను అప్పజెప్పి కనీసం అర్హత వి సీలను యూనివర్సిటీకి కేటాయించడం సిగ్గుమాలిన పని యూనివర్సిటీ ఇలాంటి ఎన్నో ఉద్యమాలకు పురుడు పోసిన పాఠాలు నేర్చుకున్న తల్లి లాంటి యూనివర్సిటీని పాలు తాగి కాలుతో తన్నినంత నీచమైన పనికి ఈ ప్రభుత్వం పోలీసులతో దాడి చేయి స్తుం దని విద్యార్థి అరెస్టు చేసిన ప్రశాంతును అంబాల కిరణ్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ఈ ఘటనపై గవర్నర్ వెంటనే తగు చర్యలు చేపట్టాలని లేనియెడల రాజ భవన్ ముట్టడి జరుగుతుందని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ ప్రధానకార్యదర్శి కోడెల నరేష్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మురుకుట్ల నరేందర్,యూత్ ఉపాధ్యక్షులు కుర్సం రమేష్,యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ చెట్టుపల్లి ముకుం దం,యూత్ కాంగ్రెస్ సభ్యులు ఎల్పి కిరణ్,బూర్గుల సతీశ్, బాసారికారి నాగార్జున, తిరుపతి,నసింగరావు, పాల్గొన్నారు.