గ్రామసభలు పెట్టి ఎంపిక చేయాలి
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మైల జయరాంరెడ్డి
ములుగు జిల్లా,మంగపేట, సెప్టెంబర్ 11
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన గృహ లక్ష్మీ పథకాన్ని అర్హులైనటువంటి నిరుపేద కుటుంబాలన్నింటికీ అందజే యాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అన్నారు.మండల కేంద్రం లోని తహసీల్దార్ ఆఫీస్ ఎదుట ధర్నా చేసి నిరసన వ్యక్తం చేశారు.బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఏకగ్రీవంగా గ్రామా ల్లో వారి పార్టీ కార్యకర్తలకి మాత్రమే అంటూ వ్యవహరించే తీరు అప్రజాస్వమికం అని అన్నారు.గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేకుండా ప్రజల పక్షంలో తీర్మానాలు చేసి అర్హులకి మాత్రమే ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మైల జయరాం రెడ్డి, జిల్లా ప్రచార కమిటీ చైర్మన్ పూజారి సురేందర్ బాబు, జిల్లా అధికార ప్రతినిధి అయ్యోరి యానయ్య , జిల్లా సెక్రెటరీలు తుడి భగవాన్ రెడ్డి, మసిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి లావుడ్యా శ్యామ్ లాల్, బీసీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు పెద్ది నరసింహారావు, జిల్లా సోషల్ మీడియా ఇంచార్జి కర్రీ నాగేంద్రబాబు,బీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కాటబోయిన నర్సింహా రావ్, బీసీ సెల్ జిల్లా సభ్యులు ఎర్రం కాని చంద్రశేఖర్, మైనార్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు మహబూబ్ ఖాన్, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోడెల నరేష్, మండల వర్కింగ్ కమిటీ అధ్యక్షులు చెట్టుపల్లి వెంకటేశ్వర్లు, కొంకతి సంబశివారావ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు మురుకుట్ల నరేందర్, బీసీ సెల్ మండల అధ్యక్షులు ముత్తినేని ఆదినారాయణ, మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు టీవీ హిదయతుల్లా , ఎస్ టి సెల్ మండల అధ్యక్షులు చదా మల్లన్న, మండల కార్యదర్శి ఏంపల్లి సమ్మయ్య, మండల సీనియర్ నాయకులు పూజారి సమ్మయ్య, మైబూబ్ హుసేన్, గొనె నర్సింహా రావ్, తోట అశోక్, మాటూరి నరసింహారావు, బండపల్లి నరసయ్య, పోదేం నాగేష్, బట్ట సూర్యనారాయణ, చింతామ రవి, సర్థన నర్సయ్య, బోడ రామచంద్రం, ఎల్ పి కిరణ్, బేత నరసింహారావు, ఎట్టి సారయ్య, జంగం భాను చందర్, చెట్టుపల్లి ముకుదాం, కుర్సం రమేష్, బాసరకారి నాగార్జున, దుర్గం బిక్షపతి, పుల్లూరి తిరుపతి, పాల్గొన్నారు.