*సి.పి.ఎస్ రద్దుకు హైదరాబాద్ తరలిన టి పి టి ఎఫ్ బృందం*
సి.పి.ఎస్ రద్దు కోసం హైదరాబాద్ లో జాయింట్ ఫోరమ్ ఫర్ రిస్టోరేషనో అఫ్ ఓల్డ్ పెన్షన్ స్కీం (JFROPS) ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో నిర్వహించే రాష్ట్ర సదస్సుకు టిఫిటిఎఫ్ గజ్వేల్ జోన్ బృందం బయలు దేరి వెళ్లారు.
ఈ సందర్బంగా జోన్ కన్వీనర్ సుంచు నరేందర్ మాట్లాడుతూ నూతన పెన్షన్ విధానం ఉద్యోగ,ఉపాధ్యాయుల జీవన భద్రతకు గొడ్డలి పెట్టు అని,వెంటనే సి.పి.ఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్ కు తరలిన వారిలో జగదేవపూర్ మండల అధ్యక్షులు, నేతి శంకర్, ప్రధాన కార్యదర్శి సత్తయ్య, గజ్వెల్ మండల ప్రధాన కార్యదర్శి తాళ్ల నాగరాజు, మర్కుక్ మండల బాధ్యులు శ్రీనివాస్సీ
నియర్ నాయకులు ఎల్లయ్య,దమ్మని మల్లయ్య,ఉపాధ్యాయులు శ్రీనివాస్, మీనయ్య,నాగ స్వామి, నర్సింలు, భజన్ లాల్, లక్ష్మయ్య, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.





