దౌల్తాబాద్: దుబ్బాక మండల పరిధిలోని హబ్సిపూర్ చౌరస్తా జాతీయ రహదారిపై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు బీజేపీ నాయకులతో కలిసి
అర్హులైన బీసీలందరికీ బీసీ బందు,దళిత బందు పథకాలని అర్హులైన నిరుపేదలకు అమలు చేయాలని రాస్తా రోకో,
ధర్నా చేపట్టారు. ఈ సందర్బంగా ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.బీసీ ల ఐక్యత వర్ధిల్లాలంటూ,బీసీలతో చెలగాటం ఆడవద్దాని,బిఆర్ఎస్ నాయకులకు కాదు నిరుపేద బీసీ కుటుంబాలకు ఇవ్వాలని నినాదాలు చేశారు. సుమారు రెండు గంటల పైగా రోడ్డు మొత్తం వాహనాలతో స్తంభించిపోయింది. అనంతరం వారిని స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. ధర్నాలో పాల్గొన్నవారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంబటి బాలేష్ గౌడ్, బీజేవైఎం రాష్ట్ర స్పోర్ట్స్ కో కన్వీనర్ తూలం వెంకట్ గౌడ్,అసెంబ్లీ కన్వీనర్ ఎస్ఎన్ చారి, దుబ్బాక మండల అధ్యక్షుడు అంబటి శివ,జిల్లా నాయకులు మల్లన్నగారి బిక్షపతి, మచ్చ శ్రీనివాస్,గోపరి యాదగిరి,పుట్ట వంశీ, సుభాష్ రెడ్డి, శ్రీకాంత్ రావు, మాధవనేని భాను,అరిగే కృష్ణ, ఆకుల నరేష్ తొగుట రవీందర్, వివిద మండల బిజెపి నాయకులు అనిల్ రెడ్డి, రామస్వామి గౌడ్,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
