హరీష్ రావు రాజీనామా లేఖతో సిద్ధంగా ఉండు.
కాంగ్రెస్ జడ్పీటీసీ అభ్యర్థి తుప్పతి బిక్షపతి
సిద్దిపేట జిల్లా జూన్ 23
రైతు రుణమాఫీపై క్యాబినెట్ తీర్మానం చేయడం హర్షనీ యమని మర్కుక్ మండల కాంగ్రెస్ జడ్పీటీసీ అభ్యర్థి తుప్పతి బిక్షపతి అన్నారు. ఈ సందర్బంగా మర్కుక్ మండల కేంద్రంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి రైతు రుణమాఫీ పై కేబినెట్ ఆమోదం తెలపడం పట్ల కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ మిఠాయిలు పంచుకున్నారు. హరీష్ రావు ఇంకా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉండమని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముదిరాజ్ సేవా సంఘం రాష్ట్ర కార్యదర్శి లింగ సత్యనారాయణ ముదిరాజ్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు పుట్ట రవి లు పాల్గొన్నారు.
