బీసీ బందు ఒక నాటకమని బిజెపి మండల ఉపాధ్యక్షుడు స్వామి గడ్డమీది అన్నారు. ఆదివారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక గ్రామంలో ఒకరి ఇద్దరికీ ఇచ్చినంత మాత్రాన బీసీలు ధనికులై పోరన్నారు. బీసీ బందు పేరుతో బీసీలను మోసం చేయడం తప్ప మరొకటి కాదు అన్నారు.ఎలక్షన్ల ముందు కెసిఆర్ ఇలా ఏదో ఒక బంధు చెప్పి ఏదో ఒక స్కీం పేరిట మోసం చేసి గద్దినెక్కడం పరిపాటుగా మారిందన్నారు.అంతకుముందు ఉప ఎన్నికల్లో పెట్టిన దళిత బంధు మధ్యలో ఎస్టీ బందు తర్వాత మైనారిటీ బందు ఇప్పుడు BC బందు ఇలా ఒక్కొక్క వర్గానికి గాలం వెయ్యాలని చూస్తున్నారు కానీ తెలంగాణ ప్రజానీకం అన్ని గమనిస్తున్నారని పేర్కొన్నారు.ఈ బూటకపు మాటలు చెల్లవు అని ఈ ఎన్నికల్లో తిప్పి కొట్టి కేసీఆర్ ని ఫాం హౌజ్ కు పరిమితం చేస్తారని అన్నారు.
