(కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం సెప్టెంబర్ 10)
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోలంపల్లి గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో గౌడ సంఘ భవనం ముందు నిరసన వ్యక్తం చేసిన గౌడ కులస్తులు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…
ఎమ్మెల్యే శంకుస్థాపన చేసి ఆరు సంవత్సరాలు గడుస్తున్నా, ఇంతవరకు గౌడ సంఘం భవనం పూర్తి కాలేదని సంఘం భవనం ముందు నిరసన వ్యక్తం చేశారు..
పొలంపల్లి గ్రామంలో 102 గడపలు ఉన్న గౌడ కులస్తులను మానకొండూరు ఎమ్మెల్యే రసమయ బాలకిషన్ చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు..
రెండు, మూడు నెలల్లో గౌడ సంఘ భవనం పూర్తి కాకపోతే, గౌడ కులస్తులందరం ఎమ్మెల్యే కు ఓటు వేయమని, ఎమ్మెల్యే మా గ్రామానికి వస్తే అడ్డుకుంటామని గౌడ కులస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు….
ఈ కార్యక్రమంలో గౌడ కులస్తులు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన వ్యక్తం చేశారు..