దౌల్తాబాద్: మెదక్ జిల్లా చేగుంట మండల పరిధిలోని ఇబ్రహీంపూర్ గ్రామానికి చెందిన లాలయ్య కూతురు మేఘమాల వివాహానికి బీఆర్ఎస్ మండల యువజన విభాగం అధ్యక్షుడు నర్ర రాజేందర్ పుస్తెమట్టెలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు అండగా ఉంటానని, తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రభు, శ్రీనివాస్, లాలు, స్వామి, ప్రశాంత్, రాజు తదితరులు పాల్గొన్నారు….
