ప్రాంతీయం

ప్రభాకర్ రెడ్డి ఘన విజయం ఖాయం

93 Views

*మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి*
దౌల్తాబాద్: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక ఎమ్మెల్యే గా కొత్త ప్రభాకర్ రెడ్డి ఘన విజయం సాధించడం ఖాయమని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి పేర్కొన్నారు.బీఆర్ఎస్ అభ్యర్థి గా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి సీఎం కేసీఆర్ అవకాశం ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ తొగుటలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డి కి ఎమ్మెల్యే అభ్యర్థి గా అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్, మంత్రి తన్నీరు హరీశ్ రావు లకు కృతజ్ఞతలు తెలిపారు..రెండు మార్లు మెదక్ పార్లమెంటు సభ్యులుగా ప్రజల కోసమే పనిచేస్తూ, సీఎం కేసీఆర్ , మంత్రి వర్యులు తన్నీరు హరీశ్ రావు గార్ల సహకారంతో దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు అండగా నిలుస్తూ, అభివృద్ధి, సంక్షేమం లో ముందుకు తీసుకెళ్తున్నారని ఆయన తెలిపారు. ప్రభాకర్ రెడ్డి గారికి మద్దతు గా హబ్సిపూర్ కు ర్యాలీగా వెళ్లారు, మాజీ మండల పార్టీ అధ్యక్షులు చిలువేరి మల్లారెడ్డి, కుంభాల శ్రీనివాస్ లు మాట్లాడుతూ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో దుబ్బాక గడ్డ మీద గులాబీ జెండా ఎగురవేయడం ఖాయమన్నారు..కార్యక్రమంలో మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు కంకణాల నర్సింహులు,రైతు బంధు మండల అధ్యక్షుడు బోధనం కనకయ్య, కో అప్షన్ సభ్యులు ఎండీ కలీమోద్దీన్, ఎంపీటీసీలు వేల్పుల స్వామి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బక్క కనకయ్య, సొసైటీ వైస్ చైర్మన్ కుర్మ యాదగిరి, మండల యూత్ అధ్యక్షుడు మాదాసు అరుణ్ కుమార్, నాయకులు సుతారి రమేష్, పబ్బతి శ్రీనివాస్ రెడ్డి, చంద్రారెడ్డి, కొమ్ము కిషన్, పులిగారి శివయ్య, గొడుగు ఐలయ్య, మంగ యాదగిరి, అనిల్, స్వామి, అబీద్, జంగిడి భిక్షపతి, సురేష్ గౌడ్, రాజిరెడ్డి, నర్సింహారెడ్డి, కొమ్ము రాజశేఖర్, బండారు రమేష్ గౌడ్, చిప్ప నర్సింహులు, యాటెల్లి రాజు, శ్రీనివాస్ గౌడ్, సుతారి రాములు, నాగరాజు, వికాస్, రాంబాబు, భీమరి స్వామి తదితరులు పాల్గొన్నారు .

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *