ట్రాన్స్ జెండర్ వ్యక్తులు సమాన అవకాశాల చట్టం ప్రకారం సమాజంలో వారికి గౌరవప్రదమైన జీవితం అందించడానికి ప్రభుత్వం ప్రత్యేకమైన చట్టాలను ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని అనుసరించి ఎన్నికల సంఘం, ఎలక్షన్ కమిషన్ ట్రాన్స్ జెండర్ వ్యక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లను చేయడం జరిగింది. దీనిలో భాగంగా అడ మగ(మెల్ ఫిమేల్ )అనే లింగ బేధం తో పాటు ట్రాన్స్ జెండర్ వ్యక్తులు కూడా ఒక ప్రత్యేక వర్గంగా గుర్తిస్తూ ఎలక్ట్రోరల్ కాలేజీలో దానికి అనుగుణంగా ఏర్పాటు చేయడం జరిగింది.
కావున జిల్లాలో ఉన్న ట్రాన్స్ జెండర్ వ్యక్తులు గా, లింగమార్పిడి చేయించుకున్న వారు ప్రత్యేకంగా ఆడ మగ అని కాకుండా ప్రత్యేకంగా ట్రాన్స్ జెండర్ వ్యక్తులు గా గుర్తింపు కావాలనుకుంటున్న వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు గుర్తింపు కార్డులు ఇవ్వబడును. కాబట్టి ఇందుమూలంగా సమస్త ప్రజానీకానికి మరియు ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీకి తెలియజేయునది ఏమనగా ఎవరైనా ట్రాన్స్ జెండర్ వ్యక్తులు ఉన్నట్లయితే వారు వెంటనే వారి వివరాలని సఖీ కేంద్రం లో వివరాలు సమర్పించవచ్చు లేదా బూత్ లెవెల్ ఆఫీసర్ కి సమర్పించవచ్చు లేదా కలెక్టరేట్లో ప్రత్యేకంగా జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో ప్రత్యేకంగా వీరి కోసం ఏర్పాటు చేసిన సెల్ నందు ఇట్టి వివరాలను నమోదు చేయవచ్చును. కాబట్టి జిల్లాలోని ట్రాన్స్ జెండర్లు ఇట్టి అవకాశాన్ని వినియోగించుకోగలరని తెలియజేస్తున్నాం…