దౌల్తాబాద్ సెప్టెంబర్10: దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి ఎమ్మెల్యే రఘునందన్ రావు తోనే సాధ్యమని కూతురు నర్సింలు, మండల రాజు లు అన్నారు. ఆదివారం దుబ్బాక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రఘునందన్ రావు సమక్షంలో బిజెపిలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళితులకు న్యాయం చేస్తారని ఆశించి బిఆర్ఎస్ పార్టీలో చేరామని, దళిత బంధు సహా అన్ని రంగాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు. దళిత బంధు ఆశ చెప్పి ఇతర పార్టీ నాయకులను బీఆర్ఎస్ నాయకులు రాజకీయ పబ్బం కోసం సామాన్య ప్రజలను మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. దుబ్బాక నియోజకవర్గం లో అర్హులైన ప్రతి ఒక్కరికి వెంటనే దళిత బంధు ఇవ్వాలని లేదంటే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలే గుణపాఠం చెప్తారని అన్నారు.
