రాజన్న సిరిసిల్ల జిల్లా లోని 13వ వార్డు సంబంధించిన స్వర్గీయులు కీర్తిశేషులు రాష్ట్ర మోచి సంక్షేమ సంఘం అధ్యక్షులు 26 వార్డ్ కౌన్సిలర్ ఓటారి కారి లక్ష్మీరాజ్యం కుమారుడు ఓటారి కారి దేవేందర్ మోచి సంక్షేమ సంఘం సిరిసిల్ల పట్టణ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా నూతనంగా ఎన్నుకున్నందుకు ఆదివారం రోజున పట్టణానికి చెందిన రాష్ట్ర ఉపాధ్యక్షులు ఓటరికరి రామచంద్రం జిల్లా అధ్యక్షులు కావా చంద్రశేఖర్,అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ నేరెళ్ల శ్రీకాంత్ గౌడ్ చిరు సత్కారం చేయడం జరిగింది. మాజీ కుల సంక్షేమానికి పాటుపడాలని గౌరవ సలహాదారులు కోరారు సంఘం పటిష్టత కొరకు కుల సంఘ సభ్యులకు ఆర్థికపరంగా సామాజిక సేవల పరంగా ముందు ఉండాలని వివరించారు ఈ కార్యక్రమంలో కుల సంఘ పెద్దలు ఓటరుకారి సాయిలు కావాల శ్రీనివాస్, కొండ్లేపు శ్రీనివాస్, బీడీ కంపెనీ రవి, ఇతరత్రా సంఘ సభ్యులు సమావేశం నిర్వహించుకొని అధ్యక్షులను సన్మానం చేశారు.
