ప్రాంతీయం

వాటర్ మెన్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

119 Views

దౌల్తాబాద్: మండల పరిధిలోని ఇందుప్రియాల్ గ్రామంలో 20 సంవత్సరాల నుండి వాటర్ మేన్ గా విధులు నిర్వహిస్తున్న గొడుగుపల్లి భూదయ్య ఇటీవల మృతి చెందగా కుటుంబానికి మంగళవారం సర్పంచ్ శ్యామల కుమార్, ఎంపిటిసి వీరమ్మ మల్లేశం, వార్డు సభ్యులు, గ్రామస్తులు రూ.37 వేలు, రెండు క్వింటాల బియ్యాన్ని కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూదయ్య కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాజేష్, నాయకులు సంభాగ యాదగిరి, ప్రవీణ్, భాస్కర్, యాదగిరి, హనుమంతు, తదితరులు పాల్గొన్నారు..

No Slide Found In Slider.

Poll not found
Telugu News 24/7