సెప్టెంబర్ 10 ఆదివారం
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలకేంద్రం లో ఆదివారం సముద్ర లింగాపూర్ లో చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు సందర్బంగా చాకలి ఐలమ్మ విగ్రహం కు పూల మాలలు వేసి ఘనంగా నివాళులార్పించారు.vటిఆర్ ఎస్ నాయకులు డాక్టర్ రాజారాం మాట్లాడుతూ తెలంగాణా ప్రజలు తెగువకు ప్రపంచానికి చాటి చెప్పిన మహిళాలోకానికి స్ఫూర్తినిచ్చిన వీరవనిత, భూమి కోసం భూక్తి కోసం, బహుజనుల, కోసం వెట్టి చాకిరి విముక్తి కో ఆలుపెరుగని పోరాటం చేసిన వీర వనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు.రజిక సంఘం నాయకులు మాట్లాడుతూ, దొరల గడిలు కూల్చి వేల ఎకరాలను ఎకరాలను బహుజనులకు పంచిన వీరనారి చాకలి ఐలమ్మ అని అన్నారు. ఈ కార్యక్రమం లో చాకలి సంఘం అధ్యక్షులు కొమ్ములపల్లి నరేష్, ఎంపిటిసి పరిశ్రమలు టిఆర్ ఎస్ సీనియర్ నాయకులు డాక్టర్ రాజారాం గ్రామస్తులు వారి కోపరేట్ డైరెక్టర్ దేవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
