గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పట్టణ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మామిండ్ల నాగులు బుధవారం రోజున మంత్రి హరీష్ రావుని వారి గృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఆప్యాయతగా మంత్రి హరీష్ రావు తన దగ్గరికి తీసుకొని పార్టీకి సంబంధించిన అంశాలు,అభివృద్ధి కార్యక్రమాల పైన ఆరా తీయడం జరిగింది.భవిష్యత్తు పార్టీ నిర్మాణం పైన మరియు వివిధ కార్యక్రమాలను ముందుండి ప్రజల వద్దకు తీసుకువెళ్లి బిఆర్ఎస్ పార్టీని విజయ తీరాలకు తీసుకువెళ్లడంలో కార్యకర్తల కృషి ఎంతో ఉంటుందని మంత్రి హరీష్ రావు అన్నారు.కష్టపడే ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని అన్నారు.ఈ సందర్భంగా పట్టణ వర్కింగ్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మామిండ్ల నాగులు ముదిరాజ్ మాట్లాడుతూ మంత్రి హరీష్ రావు ని కలవడం చాలా సంతోషంగా ఉందని, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పార్టీ కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకెళ్లి,పార్టీ గెలుపుకు కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కళ్యాణాకర్ నర్సింగారావు,పట్టణ బీసీ సెల్ అధ్యక్షుడు మల్లేశం గౌడ్, 1 వ అధ్యక్షుడు బాకీ స్వామి తదితరులు పాల్గొన్నారు.




