రాబోవు ఎన్నికల్లో అప్రమత్తంగా విధులు నిర్వహించాలి.
కరీంనగర్ పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు.
(గన్నేరువరం సెప్టెంబర్ 22)
కరీంనగర్ జిల్లా లోని గన్నేరువరం పోలీస్ స్టేషన్ ను శుక్రవారం నాడు కరీంనగర్ పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు తనిఖీ చేసారు. తొలుత గన్నేరువరం ఎస్ హెచ్ ఓ నర్సింహరావు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. తరువాత పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కను నాటారు. . పోలీస్ స్టేషన్ లోని పలు రికార్డులను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ సిబ్బంది తో మాట్లాడి రికార్డుల నిర్వహణ, అమలవుతున్న ఫంక్షనల్ వర్టికల్ పనితీర్లను అడిగితెలుసుకున్నారు. రాబోవు ఎన్నికల దృష్ట్యా పోలీస్ అధికారులు చాలా అప్రమత్తంగా ఉంటూ విధులను నిర్వహించాలని సూచించారు. ముందున్న గణేష్ నిమజ్జనంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు. స్థానిక యువకులతో ముచ్చటించారు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, మంచి అలవాట్లు అలవరచుకుని , సమయాన్ని వృధా చేయకుండా ఉన్నత శిఖరాలకు ఎదిగి ఇతరులకు ఆదర్శనంగా నిలవాలన్నారు. క్రీడలు శారీరకంగానే కాకుండా మానసికోల్లాసాన్ని కలిగిస్తాయన్నారు. ఈ సందర్బంగా స్థానిక యువతకు పోలీస్ కమీషనర్ చేతుల మీదుగా క్రికెట్ కిట్ లను , ఇతర క్రీడా సామాగ్రిని అందజేశారు.
ఈ కార్యక్రమంలో రూరల్ ఏసీపీ టి కరుణాకర్ రావు , తిమ్మాపూర్ సి.ఐ. ఇంద్రసేనా రెడ్డి , సబ్ ఇన్స్పెక్టర్లు నర్సింహారావు(గన్నేరువరం) ప్రమోద్ రెడ్డి (ఎల్ ఎం డి ), రాజేష్ (చిగురుమామిడి) ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.