నేరాలు

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

272 Views

-సైబర్ నేరాలకు గురైతే తక్షణమే టోల్ ఫ్రీ నెంబర్లు 1930, డయల్ 100,లకు కాల్ చేయండి.

-జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్.,

ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ ….
సైబర్ నేరగాళ్లు ఆశ, భయం అనే రెండు అంశాల మీద సైబర్ నేరస్తులు సైబర్ నేరాలు చేస్తున్నారని,సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు పెరుగుతున్న టెక్నాలజీని ఆసరా చేసుకుని అమాయక ప్రజలను అధిక వడ్డీ ఆశా చూపి పెట్టిన పెట్టుబడి కంటే అధిక డబ్బులు వస్తాయని మోసం చేస్తున్నారని, జిల్లా ప్రజలు ఇలాంటి అన్ లైన్ యాప్ లలో పెట్టుబడులు పెట్టి మోసపోవద్దు అని, సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.జిల్లా ప్రజలు ఎవరైనా సైబర్ మోసాలకు గురి అయితే వెంటెనే హెల్ప్ లైన్ నంబర్ 1930 ,డయల్ 100 కి కాల్ చేసి తెలియజేయగలరని అన్నారు.

-రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో ఈ వారం రోజుల వ్యవధిలో జరిగిన కొన్ని సైబర్ నేరాలు.
– సిరిసిల్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక బాధితుడికి గుర్తు తెలియని నెంబర్ నుండి కాల్ వచ్చింది క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతాం అని చెప్పగా బాధితుడు ఓటిపి షేర్ చేసుకోవడం జరిగింది దాంతో బాధితుడు 1,70,000 రూపాయలు నష్టపోయారు.
– ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో పార్ట్ టైం జాబ్ కొరకు సెర్చ్ చేయగా ఒక వాట్సాప్ నెంబర్ నుంచి మెసేజ్ వచ్చింది తర్వాత వారిని టెలిగ్రామ్ లో యాడ్ చేసి మింత్రా యాప్ లో ప్రొడక్ట్స్ లింక్స్ పంపి కార్డ్ చేయడం ద్వారా స్క్రీన్ షాట్ షేర్ చేస్తే మనీ వస్తాయని చెప్పగా చేశారు.తర్వాత టాస్క్ పేరుతో ఇన్వెస్ట్మెంట్ చేయమనగా 41,000/- రూపాయలు ఇన్వెస్ట్ చేస్తారు తర్వాత ఈ డబ్బులు తీసుకోవడానికి ఇంకా ఇన్వెస్ట్ చేయమనగా అది ఫ్రాడ్ అని తెలుసుకున్నారు.
– సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోషల్ మీడియా లో నటరాజ్ పెన్సిల్ ప్యాకింగ్ పార్ట్ టైం జాబ్ పేరుతో యాడ్ చూసి బాధితులు వాళ్లకి కాంటాక్ట్ కావడం జరిగింది పెన్సిల్ ప్యాకింగ్ చేసి ఇస్తే మీకు డబ్బులు ఇస్తామని చెప్పగా వాళ్ళను నమ్మి ఐడి కార్డ్ మరియు మెటీరియల్ ఖర్చుల కోసంఅని అమౌంట్ సెండ్ చేయమంటారు తర్వాత అవి మీకే రిటర్న్ వస్తాయి అని చెప్పగా నమ్మి బాధితులు 15000 రూపాయలు నష్టపోతారు.

– వేములవాడ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేపిస్తాము వారం రోజులలో వ్యవధిలో రెట్టింపు అవుతాయని ట్రేడింగ్ app లో ఇన్వెస్ట్మెంట్ అని చెప్పగా 2,77,000-/ రూపాయలను అందులో ఇన్వెస్ట్ చేసి మోసపోతారు

-సైబర్ నేరాలకు గురి కాకుండా క్రింది జాగ్రత్తలు పాటించాలి.
-ఓటిపి మోసాలు,ఈ మెయిల్స్ ద్వారా వచ్చే ఉద్యోగ ప్రకటన పట్ల జాగ్రత్తగా ఉండండి.
-సంస్థల నకిలీ ఈమెయిల్ ఐడి లతో జాగ్రత్తగా ఉండండి.
– ఆన్లైన్ షాపింగ్ మోసాలతో జాగ్రత్తగా ఉండండి.
– రుణ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండండి.
-డెబిట్/ క్రెడిట్ కార్డ్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండండి.
– లాటరీ మెయిల్స్/ మెసేజ్ ల పట్ల జాగ్రత్తగా ఉండాలి.
– మొబైల్స్ ఫోన్ పట్ల అప్రమత్తంగా ఉండాలి.
– మీతోనే తప్పు చేయిస్తారు, మీ అకౌంట్ లోని డబ్బులు దోచేస్తారు జాగ్రత్త.
– పెట్టుబడులు పెడతామంటూ ఫేస్బుక్ ద్వారా ఆకర్షిస్తారు జాగ్రత్త.
– ప్రేమ చిత్రాలను సోషల్ మీడియాలో పెడతామంటూ బ్లాక్మెయిల్.
– అనధికార లింకులను నొక్కితే మీ ఫోన్ హ్యాకర్ కంట్రోల్ కు వెళుతుంది జాగ్రత్త.
– భీమా కంపెనీల పేరుట మోసాలు.
– ఈ ఫైలింగ్ & ఇన్కమ్ టాక్స్ రిఫండ్ పేరిట మోసాలు.
– విదేశాల నుంచి మాట్లాడుతున్నట్లు సృష్టించి వాట్సప్ వేదికగా సైబర్ మోసాలు.
– లక్కీ డ్రాలో ఎంపికైనట్లు ఎర వేసి మోసాలు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
Telugu News 24/7