ఎల్లారెడ్డిపేట మండల మైనార్టీ యూత్ అధ్యక్షులుగా సయ్యద్ షరీఫ్ ఏకగ్రీవంగా శనివారం ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన ముస్లిం పెద్దలు మైనార్టీ సోదరులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.రానున్న రోజుల్లో ముస్లిం సోదరులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. సయ్యద్ షరీఫ్ కు బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
