హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట బంద్…




ఎల్లారెడ్డిపేట మండలంలో బుధవారం రోజున బంద్ నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్ లోని పహాల్గాం ఉగ్రవాద దాడిని నిరసిస్తూ ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంతో పాటు బొప్పాపూర్ గొల్లపల్లి ప్రధాన రహదారి చౌరస్తాల వద్ద తమ నిరసనను వ్యక్తం చేస్తూ పాకిస్తాన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు కాశ్మీర్లోని ఉగ్రవాద దాడిలో మరణించిన వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుతున్నామని అన్నారు దాడిలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ తమ సంతాపాన్ని వెలిబుచ్చారు ఈ దాడి చేసిన ఉగ్రవాదులను గుర్తించి వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. మండలంలోని ప్రతి గ్రామంలో బందును నిర్వహించి భారత్ కు మద్దతును ఇవ్వడమే కాకుండా ఐక్యతగా నిలవాలని అన్నారు. ఎల్లారెడ్డిపేట పాత బస్టాండ్ నుండి ర్యాలీగా ఊరు వాడ గ్రామాలన్నింటిని తిరుగుతూ , ఖబర్దార్ పాకిస్తాన్ కుక్కల్లారా అంటూ హిందూ ఉత్సవ సమితి నినదించారు. ప్రధాన చౌరస్తాల వద్ద దుకాణ సముదాయాలను మూసివేయించారు. కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు దాసరి గణేష్, నంది నరేష్, శ్రీనివాస్, కిరణ్ నాయక్, ప్రభాకర్ రెడ్డి, బోల్గం శ్రీనివాస్ గౌడ్, ముత్యాల ప్రభాకర్ రెడ్డి బిజెపి శ్రేణులు అనుబంధ సంస్థల నాయకులు రంజిత్ కుమార్ హిందు ఉత్సవ సమితి నాయకులు ప్రతినిధులు బంద్ ను చేసి తమకు సహకరించాలని కోరారు.
