సామాజిక పరివర్తన యాత్రను విజయవంతం చేయండి
సీనియర్ జర్నలిస్ట్ అస శ్రీరాములు
దుబ్బాక నియోజకవర్గం పరిధి లో పది రోజులపాటు నిర్వహించే సామాజిక పరివర్తన యాత్రను విజయవంతం చేయాలని సీనియర్ జర్నలిస్ట్ అంబేద్కర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు అస శ్రీరాములు కోరారు. సమాజంలో 85 శాతం ఉన్న జనాభాలో రాజ్యాంగ హక్కులు అధికారా లు బాధ్యతలను యువతను సామాజిక చైతన్యం కోసమే ఈ పరివర్తన యాత్ర నిర్వహిస్తున్నారని ఆయన చెప్పారు. రాజ్యము రాజ్యాంగం అంటే ఎన్నికలు ఒకటే కాదని, అధికారులు, రకరకాల ప్రభుత్వ విభాగ అధికారుల పనితీరు ప్రజల భాగస్వామ్యం జీవన విధానం తెలియజేయడమే ముఖ్య ఉద్దేశమని . చేప్పారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు గడిచిపోయిన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 73 సంవత్సరాలు గడిచిన మనలో విద్యా లేకపోవడం వల్ల చైతన్యం లేక మనకున్న అవకాశాలను మనం తెలుసుకోలేకపోతున్నామని వాటిని విస్తృతంగా ప్రచారం చేయవలసిన బాధ్యత మనందరిపై ఉందని అస శ్రీరాములు వివరించారు. అనాదిగా వస్తున్న ఆచారాలను నేటికీ పీడిత ప్రజలుగా ఉన్నవారు ఆచరిస్తున్నారని నేటికీ మహిళలకు సరియైన హక్కులు అధికారులు లేవని ఇంకా మూఢనమ్మకాల్లోనే మనం మగ్గుతున్నామని పీడిత వర్గాలు చైతన్యమై వారు హక్కులు బాధితులను తెలుసుకొని నడిచినప్పుడే రాజ్యాంగ ఫలితాలు పొందుతామని చెప్పారు. పీడిత వర్గాల్లో నేటికీ భూమి లేక , విద్య లేక , సరియైన ఉపాధి లేక, నివసించడానికి ఇల్లు లేక ఇలా అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని వీటన్నిటికీ పరిష్కారం పీడిత వర్గాలను చైతన్యం చేయడమేనని ఈ సామాజిక పరివర్తన ఉద్దేశమని చెప్పారు. ప్రజా సంఘాలు మేధావులు , ఉపాధ్యాయులు ఉద్యోగులు, విద్యావంతులు యువకులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ పాదయాత్రను విజయవంతం చేయాలని ఆస శ్రీరాములు కోరారు . ఈ కార్యక్రమం ఆదివారం సెప్టెంబర్ 10 నుండి 19 వరకు దుబ్బాక నియోజకవర్గం అన్ని మండలాల మీదుగా కొనసాగుతుందని కార్యక్రమం దుబ్బాక నియోజకవర్గం లోని రాయపోల్ మండలం బేగంపేట గ్రామం నుండి ప్రారంభమవుతుందని ఈ కార్యక్రమానికి ప్రారంభకులుగా సీనియర్ జర్నలిస్ట్ సిడిఎస్ చైర్మన్ రాష్ట్ర ప్రభుత్వ బుద్దవనం ఓఎస్డి మల్లేపల్లి లక్ష్మయ్య ప్రారంభిస్తారని కార్యక్రమంలో సోషల్ డెమొక్రటిక్ ఫ్రంట్ నుండి వెంకట్ రెడ్డి , ఆర్ పి వి ఎం నుండి అమ్సోల్ లక్ష్మణ్ , బహుజన ముక్తి మూర్ఛ నుండి వలిగే ప్రభాకర్, ఎల్ హెచ్ పి ఎస్ దాస్ రామ్ నాయక్, సీనియర్ అడ్వకేట్ విజయ్ దేవరాజ్ గౌడ్ , బామ్ సేఫ్ నుండి భట్టి చెన్నయ్య , బివిఎం నుండి విట్టల్ లు పాల్గొంటారని చెప్పారు. కార్యక్రమ నిర్వాహకులుగా బహుజన క్రాంతి మోర్చా దళిత బహుజన ఫ్రంట్ , రాష్ట్రీయ మూల్ నివాసి సాంగ్ , తరఫున సురేందర్ సింగ్, డాక్టర్ కుమార్ , పి శంకర్ల నాయకత్వంలో ఈ పరివర్తన యాత్ర నిర్వహిస్తున్నారని చెప్పారు. యాత్రలో పెద్ద సంఖ్యలో యువతీ యువకులు పాల్గొని విజయవంతం చేయాలని మరోసారి కోరారు




