రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కనగర్తి గ్రామానికి చెందిన ఓ చిన్నారి అనారోగ్యంతో మృతిచెందగా వారి తల్లిదండ్రులకు పలువురు ఆర్థిక సహాయం అందించారు. జిల్లా కార్మిక సంఘ అధ్యక్షుడు అక్కెనపల్లి భాస్కర్ ఆధ్వర్యంలో లేబర్ ఆఫీసర్ రఫీ తోపాటు పలువురు వ్యక్తులు తలవకొంత పదివేల రూపాయలను చిన్నారి తల్లిదండ్రులకు అందించి అండగా నిలిచారు. చిన్నారి మృతి వార్త సమాచారం తెలవగానే ముందుకు వచ్చి తలో కొంత ఆర్థిక సహాయం అందించినందుకు చిన్నారి కుటుంబ సభ్యులు జిల్లా అధ్యక్షుడు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
