తెలంగాణ రాష్ట్రంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా టీపీసీసీ అధిష్టానం కరీంనగర్ నియోజకవర్గంలోని రెండు మండలాలకు అధ్యక్షుల నియామకం చేపట్టింది.
ఈ నేపథ్యంలో నియోజకవర్గం లోని కరీంనగర్ రూరల్ మండల అధ్యక్షుడిగా బొమ్మకల్ గ్రామానికి చెందిన కామిరెడ్డి రాంరెడ్డి ని, కొత్తపల్లి మండల అధ్యక్షుడిగా కమాన్ పూర్ గ్రామానికి చెందిన పంజాల స్వామి గౌడ్ ని నియమిస్తున్నట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేసారు.
ఈ సందర్బంగా నూతనంగా ఎన్నికైన మండల అధ్యక్షులు కామిరెడ్డి రామిరెడ్డి,పంజాల స్వామి గౌడ్ మాట్లాడుతూ..
కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మండలంలోని అన్ని గ్రామాల్లోని కాంగ్రెస్ కార్యకర్తలను సంఘటితం చేస్తామని, కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామని అన్నారు. తమ నియామకానికి సహకరించిన కరీంనగర్ మాజి పార్లమెంటు సభ్యులు పొన్నం ప్రభాకర్ కి, కరీంనగర్ కాంగ్రెస్ పార్టి అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ కి, కరీంనగర్ నియోజకవర్గ నాయకులు మేనేని రోహిత్ రావు కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.