రాజన్న సిరిసిల్ల స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి సత్య ప్రసాద్ బదిలీ. ఖమ్మం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా పోస్టింగ్ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.సిరిసిల్ల జిల్లా మొట్టమొదటి స్థానిక సంస్థల అదన కలెక్టర్ గా బి సత్యప్రసాద్ ఆగస్ట్ 5, 2020 న బాధ్యతలు తీసుకున్నారు.మూడు సంవత్సరాలకు పైగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా బి సత్య ప్రసాద్ జిల్లాలో సేవలందించారు. సౌమ్యుడిగా, వివాదరహితుడిగా , సమర్థ అధికారిగా పేరు తెచ్చుకున్నారు.
