(మానకొండూర్ సెప్టెంబర్ 21)
మహిళా రిజర్వేషన్ బిల్లు పై ఎమ్మెల్సీ కవిత పోరాటం చేస్తేనే వచ్చింది అని బీఆర్ఎస్ పార్టీ అనటం పై బీజేపి రాష్ట్ర నాయకులు సొల్లు అజయ్ వర్మ ఫైర్ అయ్యారు. పార్లమెంట్ లో బీఆర్ఎస్ బలం ఎంత, బలగం ఎంత అని ఎద్దేవా చేశారు. అసలు ఈ బిల్లు వచ్చినప్పుడు కవిత ఎంపి కాదు అయినా ఆ ఘనత మాదే అన్నట్లు చెప్పుకోవడం హాస్యాస్పదం అని అన్నారు మహిళలకు గౌరవం సముచిత స్థానం కల్పించిన పార్టీ మా భారతీయ జనతా పార్టీ అని అన్నారు. నరేంద్ర మోడీ తీసుకున్న గొప్ప నిర్ణయానికి తెలంగాణ టైగర్ బండి సంజయ్ కూడా తన వంతు పాత్ర పోషించడం మన అందరికి గర్వకారణం అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో కేబినెట్ లో మహిళలకు కనీస చోటు కూడా కల్పించని బీఆర్ఎస్ ప్రభుత్వం భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లు గురుంచి మాట్లాడే అర్హత లేదు అని అన్నారు. మీకు దమ్ము దైర్యం చిత్తశుద్ది వుంటే ఈ సారి ఎలక్షన్స్ లో మహిళలకు 33 శాతం టికెట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇంకోసారి నా వల్లే మహిళా రిజర్వేషన్ బిల్లు వచ్చింది అంటే మీకు తగిన గుణపాఠం ప్రజలు చెప్తారు అని హెచ్చరించారు.