సిఐటియు హమాలి వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సర్దాపూర్ లోని వ్యవసాయ మార్కెట్ గోడౌన్లలో పనిచేస్తున్న హమాలి కార్మికులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ గత పది సంవత్సరాల నుండి రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం హమాలీ కార్మికుల సంక్షేమానికి ఇలాంటి చర్యలు చేపట్టలేదని మండిపడ్డారు అమాలి కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని, కూలి రేట్లు పెంచాలని అనేకసార్లు ప్రభుత్వం అధికారుల దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోలేదని ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు వస్తున్న సందర్భంగా ఏ పార్టీ కూడా హమాలి కార్మికుల సంక్షేమానికి సంబంధించిన డిమాండ్లను నెరవేరుస్తామని ప్రకటించలేదని హామాలి కార్మికుల సంక్షేమం కోసం పాటుపడే వారికే రాబోయే ఎన్నికల్లో హమాలీ కార్మికుల మద్దతు ఉంటుందని అన్నారు.
