రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని మండలాల స్వర్ణకార అధ్యక్షులు, ప్రధానకార్యదర్శిలు, కోశాధికారులు సరైన పనులు లేక వృత్తిని కోలిపోయే పరిస్థితి ఉన్నందున మన సమస్యలపై పోరాటం చేయవలఅని సిరిసిల్ల జిల్లా పట్టణ అధ్యక్షుడు చెన్నోజు వెంకటస్వామి శుక్రవారం తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…జిల్లాతో పాటు అన్ని మండలాల స్వర్ణకార సంఘ సభ్యులు తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సభ్యులందరూ సహకరించాలని కోరుతూ… తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలలో కలెక్టర్ ఆఫీస్ ల ముందు జిల్లాలోని అన్ని మండలాల,పట్టణాల అధ్యక్ష్యలు ప్రధాన కార్యదర్శిలు కోశాధికారులు,రాష్ట్ర స్వర్ణకార కార్యవర్గ పిలుపుమేరకు అన్ని స్వర్ణకార సంఘం సభ్యులు తేదీ 4-9-2023 సోమవారం రోజున ఒక్కరోజు స్వర్ణకార దుకాణాలు బందు పాటించి ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టి,కలెక్టర్ కి,జిల్లా ఎస్పీ కి వినతి పత్రాలు ఇవ్వవలసిందిగా అన్ని జిల్లాల్లోని స్వర్ణకార తెలియజేస్తూ శనివారం రోజున సంఘ సభ్యుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే,ఆర్డీవో,స్థానిక ఎమ్మార్వో లకు వినతి పత్రం సమర్పించడం జరుగుతుందని జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్షుడు చెన్నోజు వెంకటస్వామి ఒక ప్రకటనలో తెలిపారు.
