Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

బాధిత కుటుంబానికి సింగిల్ విండో ఆర్థిక సహాయం

246 Views

బాధిత కుటుంబానికి సింగిల్ విండో చైర్మన్ ఆర్థిక సహాయం…
ఎల్లారెడ్డి పేట మండల ప్రతినిధి
బాధిత కుటుంబానికి ఎల్లారెడ్డిపేట సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి ఆర్థిక సాయం అందించారు. మండల కేంద్రంలోని కెసిఆర్ నగర్ రెండు పడకల గదుల ఇళ్ళ కాలనికి చెందిన నిరుపేద గీత కార్మికుడు గంట దుర్గయ్య గౌడ్ కారు బోల్తా పడిన ఘటనలో దుర్మరణం చెందగా బాధిత కుటుంబాన్ని మంగళవారం గుండారపు కృష్ణారెడ్డి, గౌడ సంఘం నాయకులు, కేసీఆర్ కాలనీవాసులతో కలిసి పరామర్శించి ఓదార్చారు. అనంతరం భార్య గంట రేణుక కూతుర్లు కొడుకు శ్రీకర్ ల తో మాట్లాడుతూ కుటుంబానికి భరోసా కల్పించారు. ప్రభుత్వపరంగా బాధిత కుటుంబాన్ని ఆదుకునే విధంగా తన వంతు కృషి చేస్తానని తెలిపారు. గంట దుర్గయ్య గౌడ్ మరణం బాధాకరమని ఎప్పుడు చిరునవ్వుతో మాట్లాడే దుర్గయ్య గౌడ్ మరణించడం కుటుంబానికి తీరని లోటని బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనంతరం భార్య రేణుక కొడుకు శ్రీకర్ గౌడ్ లకు 5 వేల రూపాయల నగదును అందించారు. కార్యక్రమంలో గౌడ సంఘం పట్టణ అధ్యక్షులు గంట శ్రీనివాస్ గౌడ్, నాయకులు గంట అంజయ్య గౌడ్, చింతకింది కిషన్ గౌడ్, గంట రమేష్ గౌడ్, బుచ్చిలింగం సంతోష్ గౌడ్, గంట రవి గౌడ్, నాగుల తిరుపతి గౌడ్, గంట శ్రీనివాస్ గౌడ్, గంట వినీత్ గౌడ్, చింతకింది శ్రీనివాస్ గౌడ్, కెసిఆర్ నగర్ కాలనీవాసులు కాల్వ నర్సింలు, సుంకి భాస్కర్, భోగ శ్రీనివాస్, మహమ్మద్ జుబేర్ తదితరులు ఉన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *