ప్రాంతీయం

గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ శాఖ దాడులు

123 Views

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని గుండారం, పోచమ్మ తండా, నర్సింహుల గుట్ట తండా, బాకూరిపల్లి తండా, బొంగుల కింది తండా, తిమ్మాపూర్ అటవీ ప్రాంతాలలో ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎంపిఆర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 70 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసారు.దీనికి బాధ్యులైనటువంటి వారిని గుర్తించి కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు.ఈ దాడుల్లో జిల్లా టాస్క్ ఫోర్స్ ఎస్ఐ కిషన్, ట్రైనీ ఎస్ఐలు శ్రీకాంత్, శేఖర్, రాజేందర్ లతో పాటు హెడ్ కానిస్టేబుల్ అబ్దుల్లా, మజీద్ కానిస్టేబుల్ హమీద్, సుమన్, పర్శరామ్, రూప, అనూష, రజ్యిత పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7