*నెలలు గడుస్తున్నా పట్టించుకోని అధికారులు?
*వెంటనే నూతన వంతెన నిర్మాణం పనులు చేపట్టాలని ప్రయాణికులు కోరారు
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల గ్రామం లో ని ఎగువ మానేరు ప్రాంతంలో, కోలమద్ది నర్మాల ప్రధాన రహదారి పై వంతెన భారీ వర్షాలకు కూలిపోయింది నెలలు గడుస్తున్నా ఇరిగేషన్ అధికారులు నూతన వంతెన నిర్మించక పోవడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రాణాలు పొతే ఇరిగేషన్ అధికారులు స్పందించరా? ప్రజలు వాపోతున్నారు భారీ వర్షాలకారణంగా వంతెన కూలడం వలన కామారెడ్డి నుండి దుబ్బాక వెళ్లే బస్సు లు గాని భారీ వాహనాలు గాని భారీ వాహనాలను అటు వైపు వెల్ల నియ్యడం లేదు అందుకు అధికారులు వెంటనే స్పందించి నూతన వంతెన నిర్మాణం పనులు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు