Breaking News

చదువంటే ఇష్టం కళాలంటే ప్రాణం

88 Views

*కత్తి స్వరూపారాణి యం. ఏ (ఇంగ్లీష్) బి ఈ డి )

రాజన్న  సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల గ్రామం లో వృత్తి రంగంలో రాణిస్తూ, కళా రంగంలో శిక్షణ ఇస్తున్న ” కత్తి స్వరూపరాణి” ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ప్రత్యేక కథనం:కళా రంగంలో రాణిస్తున్న ఉపాధ్యాయినిచదువు తోపాటు సాంస్కృతిక రంగంలో విద్యార్థులను తీర్చిదిద్దుతున్న కత్తి స్వరూపరాణిఆమె వృత్తిరీత్యా ప్రభుత్వ ఉపాధ్యాయిని, ప్రవృత్తి లో మాత్రం సాంస్కృతిక జానపద కళాకారిణి. విద్యార్థులకు ఇంగ్లిష్ బోధిస్తూనే మరోవైపు కళా రంగంలో శిక్షణ ఇస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. పలు కార్యక్రమాల్లో ఎన్నో బహుమతులు సొంతం చేసుకోవడమే కాకుండా, ప్రజా ప్రతినిధులు తో ఎన్నో ప్రశంశలు అందుకున్న ఆ ఉపాధ్యాయుని పై ప్రత్యేక కథనం. కత్తి స్వరూపరాణి రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లోని నర్మాల ఎం పి యు పి ఎస్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు. ఈమె విద్యాబోధన తోపాటు విద్యార్థులను సాంస్కృతిక రంగాల్లో తీర్చిదిద్దుతోంది.. ఆమె జీవన ప్రస్థానం ప్రస్తుత జనగామ జిల్లా కు చెందిన ఈమెకు చదువుతోపాటు సాహిత్యం కళారంగం అంటే ఎంతో ఇష్టం.2000లో ఎస్ జి టిలో ఉపాధ్యాయి నిగా ఎంపికయ్యారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలం ఆల్మాస్ పూర్ పాఠశాలలో మొట్టమొదటిసారిగా ఉపాధ్యాయినిగా చేరారు.తర్వాత 2011 సంవత్సరంలో పదోన్నతి పై హుస్నాబాద్ మండలంజడ్పీ హెచ్ ఎస్ పోతారం-లో పనిచేశారు. అక్కడ తన పని తీరు తో పాటు సాహిత్యంలో అందరి మన్ననలు పొందారు. బాల్యంనుంచి స్వరూపరాణి కి ఆంగ్లంలో మాట్లాడాలనే కోరిక బలంగా నాటుకుపోయింది. ఆంగ్లంతో పాటు నాటకరంగంలో నటించాలనే కోరిక కలిగింది. ఆమెకు కలిగిన కోరికలే ఇష్టం గా మారి నటిగా చేశాయి. విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమం బోధిస్తూ మెలకువలు నేర్పుతూ ఉంటుంది. 317 జీవో ద్వారా ప్రస్తుతం గంభీరావుపేట మండలం లోని నర్మాల గ్రామంలో ఆంగ్ల బోధకురాలు గా పని చేస్తున్నారు. ఆమె నేర్చుకున్న కలను విద్యార్థులకు బోధించి, జాతీయస్థాయి పోటీలకు తీసుకెళ్లి బహుమతులు అందుకోవడానికి కృషి చేస్తున్నారు.సాధించిన అవార్డులు ప్రశంసాపత్రాలు2004లో కరీంనగర్ కళాభారతి లో జరిగిన నాటకోత్సవాలు ద బిష్ నాటక ప్రదర్శన లో నటించి అవార్డు సొంతం చేసుకున్నారు.2010లో విద్యార్థులను ఆంగ్ల బోధన లో తీర్చిదిద్దుతున్న అందుకు గాను ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ను అప్పటి డీఈవో రామేశ్వర రావు చేతులమీదుగా అవార్డు అందుకున్నారు.2013లో రెండు రోజులుగా నిరంతరం జరిగిన జాతీయ స్థాయి కవి సమ్మేళనంలో పాల్గొని తెలుగు బుక్ ఆఫ్ రికార్డుల్లో చోటు సాధించారు.2015లో మిర్యాలగూడ లో జరిగిన తెలంగాణ తెలుగు నాటకోత్సవం లో దబిష్ అనే నాటకంలో నటించి ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు.2015లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం ఏర్పాటు చేసిన సాంస్కృతిక సంబరాల్లో కత్తి స్వరూపరాణిమండల ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ఎమ్మెల్యే సతీష్ కుమార్ చేతుల మీదుగా అందుకున్నారు.2016లో తిరుపతిలో జరిగిన నాటకోత్సవాల్లో ఉత్తమ నటిగా “అశ్వం “అవార్డు అందుకున్నారు.2017లో నృత్య కల ఉత్సవాల్లో పాల్గొని ఉత్తమ నృత్య కళాకారిణిగా ప్రశంసలు పొందారు. ప్రభుత్వం చేపట్టిన కల్యాణలక్ష్మి, హరితహారం, స్వచ్ఛభారత్ వంటి పలు సంక్షేమ కార్యక్రమాల ప్రచార డాక్యుమెంటరీలో నటించి ప్రశంసలు అందుకున్నారుకత్తి సరూపరాణి శిక్షణతో విద్యార్థుల ప్రతిభజాతీయ సైన్సు దినోత్సవం ఎం పి యు పి ఎస్ నర్మాల లో ఘనంగా నిర్వహించడం జరిగింది.గంభీరావుపేట మండలంలో మొట్టమొదటి సారిగా సమ్మర్ క్యాంప్ లో భాగంగా స్పోకెన్ ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్ విద్యార్థులకు నేర్పించడం జరిగింది. తదనంతరం అక్షరాభ్యాస కార్యక్రమం కూడా అంగరంగ వైభవంగా నిర్వహించారు.విద్యా బోధన తో పాటు ఉపాధ్యాయురాలు స్వరూపరాణి ఇచ్చిన శిక్షణతో, ఆగస్టు 6 -2022 నర్మాల ఎం పి యు పి ఎస్ విద్యార్థులు, తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో నందు భారత ప్రభుత్వ, సాంస్కృతిక శాఖ న్యూఢిల్లీ, ఆంధ్ర రాష్ట్ర సృజనాత్మకత, మరియు సాంస్కృతిక సమితి అమరావతి, తిరుమల తిరుపతి దేవస్థానములు, హిందూ ధర్మ ప్రచార పరిషత్ అభినయ ఆర్ట్స్, “హనుమ అవార్డ్స్” తిరుపతి వారి సౌజన్యంతో 22 వ వార్షిక జాతీయస్థాయి జానపద నృత్య పోటీలలో నర్మాల విద్యార్థులు పాల్గొని, మొదటి బహుమతి పొందడం జరిగింది. విజయం సాధించిన విద్యార్థులను సంస్థ అధ్యక్షులు బి.యన్.రెడ్డి శాలువాతో ఘనంగా తిరుపతిలో సన్మానించారు.

Oplus_131072
Oplus_131072
Anugula Krishna