సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం లోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండపొచమ్మ దేవాలయం అమ్మవారిని శనివారం ఎస్ ఐ కృష్ణమూర్తి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు, అనంతరం జాతర ఏర్పాట్లు పరిశీలించి తగు సూచనలు చేశారు ఈ సందర్భంగా పురోహితులు సర్పంచ్ రజిత రమేష్ ఆధ్వర్యంలో ఎస్ ఐ కృష్ణమూర్తి కి శేష వస్త్రంతో సన్మానించి ప్రసాదం అందజేశారు కొండ పోచమ్మ దేవస్థానం డైరెక్టర్ గోలి సంతోష్ సౌజన్యంతో తీసుకు వచ్చిన నూతన వస్త్రాలు అమ్మవారికి,పురోహితులకు ఎస్ ఐ చేతుల మీదుగా అందజేశారు ఈసందర్భంగా ఎస్ ఐ కృష్ణమూర్తి మాట్లాడుతూ కొండ పోచమ్మ అమ్మవారి ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఉండాలని అమ్మవారిని వేడుకోవడం జరిగిందని,అందరికీ సంక్రాతి శుభాకాంక్షలు తెలిపారు కొండ పోచమ్మ జాతర కు తెలంగాణ రాష్ట్ర నలుమూలతో పాటు ఇతర రాష్ట్రాల వారు అమ్మవారిని దర్శించుకుని వెళ్తుంటారు అని, కొండ పోచమ్మ జాతరలో పాల్గొనే వారు జాగ్రత్తలు పాటించాలని సూచించారు ఈ కార్యక్రమంలో దేవాలయం ఇఓ మోహన్ రెడ్డి, ఎంపీటీసీ కావ్య దర్గయ్య,కొండ పోచమ్మ దేవస్థానం డైరెక్టర్లు గోలి సంతోష్,ఆర్కే శ్రీనివాస్, నరసింహ రెడ్డి, మాజీ డైరెక్టర్ అయిత సత్యనారాయణ,మనం ఫౌండేషన్ సభ్యులు ఉత్తునూరి సంపత్,భక్తులు తదితరులు పాల్గొన్నారు
