*కాళోజి ఆశయాలు కొనసాగిద్దాం*
కాళోజి జయంతి సందర్బంగా టిఫిటిఎఫ్ గజ్వేల్ జోన్ ఆధ్వర్యంలో జోన్ కార్యాలయంలో కాళోజి జయంతి కార్యక్రమం నిర్వహించారు.
ఈసందర్బంగా జోన్ కన్వీనర్ సుంచు నరేందర్ మాట్లాడుతూ
బతుకంతా తెలంగాణ కు ఇచ్చిన మహనీయుడు కాళోజి అని అన్నారు. కాళోజి రాజకీయ,సాంఘిక చైతన్యాల సమాహారం అని,తెలంగాణ జీవిత చలన శీలి,నిజాం నిరంకుశ పాలన పై కలం ఎక్కుపెట్టిన ప్రజాకవి అని,
అన్నీ భాషలు నేర్చుకో,కానీ మాతృభాషను మాత్రం తప్పకుండా నేర్చుకో అని చెప్పిన కాళోజి తెలంగాణ యాసను,భాషను ప్రాచుర్యంలోకి తెచ్చారు.
అన్నపు రాశులు ఒక.చోట,ఆకలి చావులు ఒక చోట,అంటూ బడుగు,బలహీన వర్గాలకు బాసటగా,భుస్వామ్య వాదాన్ని తిరస్కరించిన ప్రజావాది, పౌర హక్కులకె కాదు,సమాజంలో ఏ దారుణం జరిగినా ఖండించడం లో ఆయన ముందు ఉండేవారు. “దోపిడీ చేసే ప్రాంతేతరులను దూరం దాకా తన్ని తరుముతాం, ప్రాంతం దోపిడీ చేస్తే ప్రాణం తోనే పాతర వేస్తం ” అని దళారుల అణిచివేత,దోపిడీలను,వాళ్ళతో మిలాఖతైన ప్రాంతం వారిని నిర్ద్వందంగా ఖండించారు అని అన్నారు.
ఇట్టి కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిలర్ రాజులు, పూర్వ అధ్యక్షులు రాంచంద్రం, వర్గల్ మండల అధ్యక్షులు పర్వతం నర్సయ్య, గజ్వేల్,దౌల్తాబాద్ మండలాల ప్రధాన కార్యదర్శులు పర్వతం నర్సయ్య, మాచపురం యాదయ్య, జిల్లా కౌన్సిలర్లు పంబాల ఎల్లయ్య,దమ్మని మల్లయ్య,మార్కుక్,జగదేవ్ పూర్ మండలాల నాయకులు వేముల మల్లేశం, మల్కగళ్ల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
