తెలంగాణ భాషాసంస్కృతి గొప్పతనం ప్రపంచానికి చాటాలి.
( *కాళోజీనారాయణ 109జయంతి సందర్భంగా ఘనంగా తెలంగాణభాషా దినోత్సవం)*
*తెలంగాణ భాష పేరుమీదనే తెలంగాణ ప్రాంతం ఏర్పడిందనీ భాషా సంస్కృతి గొప్పదనీ, ప్రపంచానికి చాటి చెప్పాలనీ, కాళోజీ నారాయణరావు తెలంగాణభాషలో రచనలు చేయడంతోపాటు తెలంగాణభాషా రక్షణకు పాటుపడ్డారనీ రాజన్న సిరిసిల్ల జిల్లా రచయితల సంఘం ప్రధానకార్యదర్శి డా.వాసరవేణి పరశురాం అన్నారు.*
తేదీ 09-09-2023 రోజున ఎల్లారెడ్డిపేటలో రాజన్న సిరిసిల్ల జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు 109వ జయంతిని నిర్వహించారు. ఆయన ఫోటోకు పూలాలంకరణచేసి నివాళులు తెలిపారు.
ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా రచయితల సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి డా.వాసరవేణి పరశురాం మాట్లాడుతూ కాళోజీ నారాయణరావు ప్రజల సమస్యలను, బాధలను ఇతివృత్తం చేసి కవిత్వం రచించారనీ, తెలంగాణ ప్రజలభాషలో రచించారన్నారు. తన కవిత్వంలో “అన్యాయాన్ని ఎదిరిస్తే నాగొడవకు సంతృప్తి,అన్యాయాన్ని ఎదిరించినవాడు నాకు ఆరాధ్యుడు” స్వాతంత్ర్యబనసకుడా స్వైర విహారంబుగాదు” అని తెలిపారన్నారు. నాగొడవ, జీవనగీతికలాంటి రచనలెన్నో చేశారనీ, తెలంగాణ ఉద్యమం, గ్రంథాలయోద్యమంలో పాల్గొన్నారనీ, తెలంగాణప్రభుత్వం ఆయనపేరుమీద అవార్డు ఇవ్వడం, తెలంగాణ భాషాదినోత్సవం జరుపడం సంతోషకరమనీ అన్నారు.
ఈ కార్యక్రమంలో *రాజన్న సిరిసిల్ల జిల్లా రచయితల సంఘం ఎల్లారెడ్డిపేట మండలశాఖా అధ్యక్షుడు దుంపెన రమేశ్, ప్రధానకార్యదర్శి కట్ల శ్రీనివాస్, మరియు గజభీంకార్ అజయ్, ప్రవీన్ ,నరేష్* తదితరులు పాల్గొన్నారు.




