Breaking News రాజకీయం

సెస్ డైరెక్టర్ గా గెలిపించండి……దొమ్మాటి నర్సయ్య

157 Views

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల సెస్ డైరక్టర్ గా గెలిపించాలని గురువారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిరిసిల్ల సెస్ సహకార పరిధిలో 1,60,000 ఓట్లతో జరగాల్సిన ఎన్నిక ఈరోజు 80000 ఓట్లతో జరుగుతుందన్నారు. ఎల్లారెడ్డిపేట మండలంలో 14000 ఓట్లతో జరగాల్సిన ఎన్నిక 7వేల ఓట్లకు రావడం జరిగిందన్నారు. మృతి చెందిన ఓటర్ల పేర్లను సంస్థ పాలకవర్గం మార్చకపోవడం సెస్ వైఫల్యం అన్నారు. నేను గెలిస్తే గ్రామ గ్రామాన చనిపోయినవారి పేర్లను కూర్చుండి మీటర్ల పేర్లను మార్పించడం జరుగుతుందన్నారు. కొంతమంది అధిక బిల్లులు వచ్చిన వారు సెస్ కార్యాలయం చుట్టూ తిరిగిన వారి సమస్యను పరిష్కరించలేదన్నారు. ఇప్పటికీ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే రైతులకు సకాలంలో అందించడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు షేక్ గౌస్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి జిల్లా మైనార్టీ జిల్లా అధ్యక్షులు ఎస్కే సాహెబ్ నాయకులు గంట భుచ్చగౌడ్ మొగుళ్ళ మధు రెడ్డి రొడ్డ రామచంద్రo కిషన్ కోనేటి పోచయ్య చెట్పల్లి బాలయ్య గుర్రం రాములు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found