*13500 ఖాళీగా ఉన్నాయని అధికారిక లెక్కలు కాదా!!*
*తెలంగాణకు డీఎస్సీ రాసే D.EI.ED. అభ్యర్థులరా చైతన్యం కండి.*
*వెంటనే అభ్యర్థులకు న్యాయం చేయాలి*
*ఏఐఎస్బి జిల్లా నాయకుడు గడిపే సుజిత్ కుమార్..*
హుస్నాబాద్
స్తీరా పడి తమ జీవితాలను కుటుంబాన్ని బాగు చేసుకుందామని కలలు కన్నారు ఇప్పుడు ఆ కల్లలైనవి.ఇన్ని రోజుల కాలయాపన జరిగి తీర పోస్ట్ సంఖ్య చూస్తే చాలా అన్యాయంగ బాధాకరంగా ఉంది అన్నారు. ఏఐఎస్బి జిల్లా నాయకుడు గడిపే సుజిత్ కుమార్ మాట్లాడుతూ. వేలాదిమంది అభ్యర్థులు చాలా రోజుల నుండి డీఎస్సీ కొరకు నిరీక్షిస్తున్నారు. చాలామంది అభ్యర్థులు ఏజ్ బార్అవుతున్నారు. తీరా ప్రభుత్వం ప్రకటన చూస్తే అభ్యర్థులు వారి కుటుంబాలు తీవ్రమైన బాధతో కృంగిపోతున్నారు, ఇన్ని రోజులు కాలయాపన జరిగి తీర ప్రభుత్వం పోస్టుల సంఖ్య చూస్తే నిరాశకులవుతున్నారు. కొన్ని సంవత్సరాల నుండి కోచింగ్ లని లైబ్రరీలు పుస్తకాలతో, కుస్తీపడి తమ జీవితాలను కుటుంబాలని బాగు చేసుకుందామని ఎన్నో ఆశపడ్డారు. తెలంగాణలో చూస్తే బార్లు రెస్టారెంట్లు వీటి సంఖ్య పెంచుతారు. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి . ఉద్యోగుల విషయానికి వస్తే ఏం మాట్లాడారు కెసిఆర్ వాళ్ళ కుటుంబ సభ్యులకు పదవులు కావాలి కానీ. అభ్యర్థులకు నోటిఫికేషన్ పోస్టుల సంఖ్య పెంచడు. అభ్యర్థుల జీవితాలతో చిలగటం ఆడుతున్నాడు ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు పూర్తిగా భర్తీ చేయాలి. ఉద్యోగ నోటిఫికేషన్ ఎందుకు పెంచడం లేదని మండిపడ్డారు. త్వరలోనే ప్రమోషన్ ఇచ్చే అవకాశం ఉంది ఈ ప్రమోషన్ ద్వారా దాదాపు 9.984 (ఎస్ జి టి) పోస్టులు ఖాళీ అయ్యే అవకాశం ఉంది . ప్రమోషన్ ద్వారా ఏర్పడిన ఖాళీలను కూడా ప్రస్తుతం జారీ అయ్యే నోటిఫికేషన్ లోనే కలపాలి పోస్టుల సంఖ్య పెంచాలి. లేని పక్షంలో అభ్యర్థులతో ఏఐఎస్బి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలో చేపడతామని హెచ్చరించారు .ఈ కార్యక్రమంలో ఏఐఎస్బి మండల నాయకులు మాదరబోయిన అజయ్, నీలికొండ రాకేష్, గద్దర్ శ్రావణ్, శుభం, శివ చరణ్, అరవింద్,కార్తీక్,భాను ప్రసాద్, తదితరు పాల్గొన్నారు





