యువతకు స్ఫూర్తి కాళోజి ఆరుట్ల కిషన్, ఆరుట్ల లింగం
సిద్దిపేట్ చేర్యాల మండల పరిధిలోని కడవేరుగు గ్రామంలో కాళోజి జన్మదినని ఘనంగా, వైభవంగా, కన్నుల పండుగగా కాళోజి చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు
ఈ సందర్భంగా కాళోజి యూత్ అసోసియేషన్ అధ్యక్షులు ఆరుట్ల కిషన్, ఆరుట్ల లింగం మాట్లాడుతూ కాళోజి సేవలు మరువలేనిదని, యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమని అని అన్నారు
కాలోజి నారాయణరావు 1914 సెప్టెంబర్ 9న రంగారావు రాఘవమ్మలకు జన్మించారు ఆయన జన్మదినాన్ని తెలంగాణ తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటున్నామని ఆయన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో కాలోజీ యూత్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు
