రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం మల్కాపూర్ గ్రామంలో పేకాట స్థావరం పై పోలిసుల ఆకస్మిక దాడీ చేసి 6 వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద ఉన్న నగదు15,000/- రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఎస్.ఐ మహేందర్ మాట్లాడుతూ..బోయినపల్లి స్టేషన్ పరిధిలోని మల్కాపూర్ గ్రామ శివారులో డబ్బులు పందెం పెట్టుకుని రహస్యంగా పేకాట ఆడుతున్నారు.
అనే పక్కా సమాచారం మేరకు తన సిబ్బంది తో గురువారం రోజున అందజ మధ్యాహ్నం సమయంలో పేకాట స్థావరం పై దాడి చేసి పేకాట ఆడుతున్న 06 మంది వ్యక్తులను పట్టుకుని వారి వద్ద నుండి 15,000/-రూపాయల నగదు స్వాధీనం చేసుకొని వారి పై కేసు నమోదు చేయడం జరిగిందన్నారు.