దౌల్తాబాద్ మండల పరిధిలోని దీపాయంపల్లి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబం తల్లీ, తండ్రి లేనందున గతంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గృహ నిర్మాణానికి లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేశారు. గజ్వేల్ మెడికల్ సంతోష్ సహకరంతో నిరుపేద కుటుంబానికి చెందిన సమీరా వివాహానికి వధువుకు పూస్తే, మట్టెలు దౌల్తాబాద్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా, దౌల్తాబాద్ మండల పార్టీ అధ్యక్షుడు రణం శ్రీనివాస్ గౌడ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసి డైరెక్టర్ పబ్బ అశోక్ గుప్తా, మాజి సర్పంచ్ చిక్కుడు సత్యనారాయణ, మాజీ ఉప సర్పంచ్ దుర్గష్, సీనియర్ నాయకులు జయరాం రెడ్డి, స్వామి,కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.




