దూల్యా నాయక్ పార్థివ దేహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి.
పెద్దకొత్తపల్లి మండలం జొన్నలబోగుడ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ నాయకులు రవి నాయక్ తండ్రి దూల్యా నాయక్ గారు అనారోగ్యంతో బాధపడుతు నిన్న పరమపదించారు.
ఈ విషయం తెలిసి నేడు ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి జొన్నలబోగుడ గ్రామంలోని వారి ఇంటికి వెళ్ళి దూల్యా నాయక్ పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం ఇంటి పెద్దను కోల్పోయిన బాధలో ఉన్న దూల్యా నాయక్ కుమారుడు,బిఆర్ఎస్ నాయకులు రవి నాయక్ ని , కుటుంబ సభ్యులను పరామర్శించి దైర్యం చెప్పిన ఎమ్మెల్యే.
సర్పంచ్ గా మరియు ఎంపిటిసి గా ప్రజలకు వారు చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకొన్న ఎమ్మెల్యే.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు,టీఆర్ఎస్ నాయకులు,గ్రామ ప్రజలు తదితరులు ఉన్నారు.