వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి వారి దర్శనానికి ఆదివారం వచ్చిన వరంగల్ జిల్లా నర్సంపేట గ్రామానికి చెందిన భక్తులు రామందీర్ వీధిలో గల ధరణి లాడ్జి లో గది అద్దెకు తీసుకొన్నారు. మంగళవారం బద్దిపోచమ్మ మొక్కులు
చెల్లించుకొని తిరిగి వచ్చి చూడగ వారి గది తాళం తీసి సామానులు లగేజ్ సంచులు చిందర వందరగా పడేశారు. వాటినుంచి అర తులం బంగారం,రెండు రెడీమీ నోట్ 9ప్రో మొబైల్ ఫోన్ లు, సుమారు ఇరవై వేల రూపాయలు చోరికి గురైనట్టు బాధితులు తెలిపారు. భక్తులు పోలీసు లకు సమాచారం అందించారు. లాడ్జి నిర్వాహకులను సంప్రదించగా మాకు సంబంధం లేదని సమాదానం చెప్పారని భక్తులు వాపోయారు.అట్టి భక్తులు లాడ్జి నిర్వాహకుల పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.