రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో మైనార్టీ ముస్లిం ఫంక్షన్ హాల్ లో డిక్లరేషన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆదివారం రోజున నిర్వహించుకున్నారు ఈ యొక్క సమావేశంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా అన్ని మండలాల నుండి సుమారు 500 మంది ముస్లిం మైనార్టీ నాయకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మహమ్మద్ అన్సారీ స్కై బాబా సలీం పాషా అబ్దుల్ మజీద్ హాజరయ్యారు అనంతరం వారు మాట్లాడుతూ మైనార్టీల యొక్క ముస్లిం ఎజెండా 22 అంశాల గురించి ప్రస్తావించారు ఈ యొక్క అంశాలకు ఎవరు మద్దతు ఇచ్చినా వారికి మాత్రమే ఓటు వేయాలని అభ్యర్థించారు ఈ సమావేశంలో మండల మైనార్టీ అధ్యక్షులు షేక్ షాదుల్లా మహమ్మద్ బాబా సాహెబ్ గౌస్ ఇర్ఫాన్, రఫీక్ అలీమ్ లతీఫ్ షాదుల్ దర్వేష్ యూసఫ్ గంభీరావుపేట వీర్నపల్లి తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు మైనార్టీలు అందరికంటే ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని అంతేకాకుండా వారికి ప్రభుత్వపరంగా ఆర్థిక సహాయం అందజేయాలని కోరారు.




