ముస్తాబాద్/సిరిసిల్ల/అక్టోబర్/26; భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతి ఏటా వేసుకునే అయ్యప్ప, ఆంజనేయ, శివయ్య, సాయిబాబా మాలలు ధరించి నిష్టగా 41 రోజులు దైవాన్ని కొలుస్తారు. తెలుగు రాష్ట్రాలలో ఎంతో పేరు గాంచిన అయ్యప్ప స్వామి మాలను భక్తులు ఎక్కువగా ఆదరిస్తారు. 41 రోజులు నిష్టగా దీక్ష చేసి, ఇరుముడులు కట్టుకొని శబరి మలైకి వెళ్లి స్వామిని దర్శనం చేసుకొని వస్తారు. ఈ దీక్ష సమయంలో ప్రతి రోజు స్వామిని స్మరిస్థుంటారు. అలాగే ఈరోజు ముస్తాబాద్ మండలంలో ఎంపీపీ జనగామ శరత్ రావుతో పాటు (సాక్షి) పాత్రికేయులు అవధూత శేఖర్, మొఱ్ఱై పల్లె సర్పంచ్ షడిమెలఎల్లం, తదితరులు భక్తులు కార్తీక మాసం మొదటి రోజున అయ్యప్ప (దీక్ష) మాలలు ధరించారు. అనంతరం ముస్తాబాద్ ఎస్సై వెంకటేశ్వర్లతో పాటు స్వీయ నిర్వహణలో మొన్నటి వరకు నిర్వహించిన కేటీఆర్ ఉచిత కోచింగ్ సెంటర్ లో కోచింగ్ తీసుకొని పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామ్ కు క్వాలిఫై అయినా ఉద్యోగార్దులు ఈరోజు ఎంపీపీ శరత్ రావును కలిశారు. వారందరికి శుభాకాంక్షలు తెలిపిన శరత్ రావు జరగబోయే శరీర దారుడ్య పరీక్షలకు వారు సన్నద్ధం కావడానికి వారందరికీ అన్ని విధాలుగా అండగా ఉండి, ప్రతిరోజు టిఫిన్, ఎగ్స్, అందిస్తానని డ్రెస్ కోడ్ పాటించుటకు డ్రెస్సులు అందిస్తానని ఉద్యోగాలు సాధించే వరకు అన్ని విధాలుగా తోడుగా వుంటానని చెప్తూ, ఉద్యోగార్దులు మాత్రం ఎలాంటి నెగ్లేట్ చేయకుండా ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా ప్రిపేర్ కావాలని ఎంపీపీ వారిని కోరారు.
