దౌల్తాబాద్: డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సర్పంచ్ అప్పవారు శ్రీనివాస్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని గాజుల పల్లి ప్రాథమిక పాఠశాల లో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి నుంచి ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా రాధాకృష్ణన్ అందించిన సేవలను నేటితరం ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. అనంతరం ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎంసి చైర్మన్ దశరథం తదితరులు పాల్గొన్నారు….




