ప్రాంతీయం

*రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు కలెక్టర్ అలెర్ట్.*

135 Views

*భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని హెచ్చరిక*

సిరిసిల్ల 11, సెప్టెంబర్ 2022:
భారీ వర్షాల నేపథ్యంలో నేడు, రేపు రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అలెర్ట్ చేశారు.ఈ మేరకు ఆదివారం ఉదయం ప్రకటన విడుదల చేశారు.జిల్లా ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని సూచించారు.  చిన్నపిల్లలతో పాటు ప్రజలు జాగ్రత్తలు పాటించాలని కోరారు.
ఆదివారం , సోమవారం అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున.. ప్రజలు, ముఖ్యంగా పిల్లలు వాగులు,వంకలు, నీటి ప్రవాహాలు , చెరువుల వద్దకు వెళ్లవద్దని సూచించారు.జిల్లా లోని పలు కాజ్ వేలు, లో లెవెల్ వంతెనల పై వర్షపునీరు ప్రమాదకరంగా ప్రవహిస్తున్న దృష్ట్యా వాటిని దాట వద్దని అన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజకు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళాలని కోరారు.భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ స్తంభాలు తడిసిపోయి షాక్ వచ్చే అవకాశం ఉన్నందున వాటిని తాకవద్దని , దూరంగా ఉండాలని సూచించారు.జిల్లా యంత్రాంగం సహాయం కోసం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం నెంబర్ 93986 84240 ను సంప్రదించాలని జిల్లా కలెక్టర్ ప్రజలకు తెలిపారు.

No Slide Found In Slider.

Poll not found