ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మార్చి 24, క్లాస్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్లమ్మల లక్ష్మణ్ గౌడ్ సిరిసిల్లలో మాట్లాడుతూ సమగ్ర శిక్షలో భాగంగా గత 15 సంవత్సరాలుగా విద్యా శాఖలోపనిచేస్తున్న KGBV/CRP/MISCO/IERP/PTI s/Messengers/URS Staff/DPO Staff సిబ్బందిని రెగ్యులర్ చేసి వేతన స్కేలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఢిల్లీ మహారాష్ట్ర ఒరిస్సా హర్యానా రాష్ట్రాలలో సమగ్ర శిక్షలో పనిచేస్తున్న సిబ్బందిని రెగ్యులర్ చేయడం జరిగిందని మన రాష్ట్రంలో కూడా రెగ్యులర్ చేయాలని కోరారు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని అంతేకాకుండా వారిని రెగ్యులర్ స్కేలులో నియామకం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇట్టి కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు వికృతి లక్ష్మీనారాయణ, రాష్ట్ర కార్యదర్శి బండారి మల్లేశం, జిల్లా అధ్యక్షులు పులి రామ్ గోపాల్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఇటికాల సుధాకర్ జిల్లా అసోసియేట్ అద్యక్షులు తాడికొండ కృష్ణ హరి, రాష్ట్ర కౌన్సిలర్ కాలేరు, రాజన్నజిల్లా ఉపాధ్యక్షులు తిరుపతి, పి. బాల గౌడ్, ఎన్. అశోక్ ,మహేష్, రాజు, శ్రీనివాస్, వెంకన్న, అంజయ్య, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.




