తిమ్మాపూర్ మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన పుప్పాల శ్రీకాంత్ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా వారి జ్ఞాపకార్థం బజరంగ్ దళ్ యూత్ సభ్యులు గ్రామంలోని జడ్పీఎస్ హై స్కూల్ విద్యార్థులకు టిఫిన్ బాక్సులు పంపిణీ చేశారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ చనిపోయిన మా మిత్రుడు పుప్పాల శ్రీకాంత్ భౌతికంగా తమ మధ్య లేకపోయినా వారి జ్ఞాపకార్థంగా స్కూల్లో 100 మంది విద్యార్థులకు టిఫిన్ బాక్సులు పంపిణీ చేశామని తెలిపారు. అనంతరం బజరంగ్ దళ్ యూత్ సభ్యులను స్కూల్ ప్రధానోపాధ్యాయుడు, గ్రామస్తులు అభినందించారు